Chenetha TV- Health news: అల్లం టీ లో మానవ శరీరానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అల్లం టీ గుండె సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అల్లం గడ్డకట్టిన రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి రోజూ తీసుకుంటే చాలా మంచిది. పీరియడ్స్ ఓ 4 రోజుల ముందు నుంచే అల్లం టీ తాగడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలా వరకు దూరమవుతాయి. వీటితో పాటు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడేవారు అల్లం టీని రోజూ తాగితే ఆ సమస్యలు తగ్గుతాయి. అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం టీ బాగా పనిచేస్తుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా శరీరంలోని కొవ్వులాంటి పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి త్వరలోనే అధిక బరువు అదుపులోకి వస్తుంది. రెగ్యులర్ గా అల్లం టీ తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి.