Chenethatv, New Delhi: పార్లమెంట్ బడ్జెట్ సమావే శాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమ య్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌ను సమర్పించను న్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌కు సమర్పించింది. నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నిర్మలమ్మ సభలో ప్రసంగిస్తున్నారు.