Chenetha TV_ Sircilla news: సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్కు చెందిన తోటిచర్ల సాయి వర్ధన్ s/o సురేష్, గత కొద్ది నెలల క్రిందట తల్వార్ మరియు పెద్ద కత్తితో విన్యాసాలు చేయుచు వాటిని పట్టుకొని వివిధ ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా అట్టి ఫోటోలు మరియు వీడియోలు పోలీసు వారు దృష్టికి రావడంతో అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి తేదీ 17-07-2024 రోజున అతడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక పెద్ద కత్తి మరియు మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్టుగా సిరిసిల్ల పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ K. కృష్ణ గారు తెలిపినారు. ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆన్లైన్ రీల్స్ మరియు వీడియోల పేరుతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకున్న బడును.