ఫేక్డాక్టర్స్, భాగ్యనగరంలోచాలానకిలీక్లీనిక్స్

Chenetha TV- Fake doctors in Hyderabad

Chenetha TV- Hyderabad news: వైద్యో నారాయణ హరీ! అంటారు జబ్బు నయం చేస్తారంటూ దేవుడిలా భావిస్తూ, వైద్యుల దగ్గరకు వెళ్తారు. అలాంటిది అరకొర చదువులతో క్లినిక్‌లు తెరిచి ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే వైద్యం పేరుతో జనాలను దోచేస్తున్న నకిలీ డాక్టర్ల భరతం పడుతున్నారు వైద్యాధికారులు.  హైదరాబాద్ మహానగరం పరిధిలో పలు క్లీనిక్స్‌పై దాడులు చేశారు.  నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా పలువురు RMPలకు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్ మహానగరం పరిధిలో గత కొన్ని రోజులుగా ఫేక్ డాక్టర్స్ భరతం పడుతున్నారు వైద్యాధికారులు. నకిలీ వైద్యుల ఆటకట్టిస్తున్నారు. గత వారం క్రితం జీడిమెట్ల, బాలానగర్ పరిధిలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, క్లినిక్స్ పై దాడులు చేసిన వైద్యాధికారులు సుమారు 50 మంది పై FIR నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు సికింద్రాబాద్ మారేడుపల్లి అడ్డగుట్ట ప్రాంతంలో వైద్య మండలీ సభ్యులు దాడులు నిర్వహించారు. నకిలీ వైద్యులను వరుస దాడులతో వైద్య శాఖ అధికారులు హడలెత్తించారు. వైద్యుల అర్హతలు, వారు చదివిన కాలేజ్‌ వివరాలు తెలుసుకున్నారు. కొందమందికి వైద్య అర్హతలు లేకపోగా, RMPలుగా ఉంటూ క్లీనిక్లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంపై  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్ట పరంగా నోటీసులు అందించడంతో పాటు వెంటనే క్లీనిక్లను మూసివేయలంటూ సూచించారు. పలు క్లీనిక్స్‌పై ఫిర్యాదులు రావడంతో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోన్నన్నట్లు వైద్య మండలీ అధికారి ప్రతిభ లక్ష్మి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *