
Chenethatv, Vemulawada: తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రూ.10లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా రూ.10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారంఈ మేరకు బుధవారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయ అధి కారులకు రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.