ChenethaTv, Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శనివారం ఎన్నికల ప్రచారంలో తన భర్తను “హర్యానా కా లాల్ ” (హర్యానా కుమారుడు)గా అభివర్ణిస్తూ ఓటర్లను కొత్త సెంటిమెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..
అరవింద్ కేజ్రీవాల్ “హర్యానా కా లాల్ ” (హర్యానా కుమారుడు). సివానీ గ్రామంలో జన్మించి, హిసార్‌లో పెరిగాడు.
“మీ కొడుకు (అరవింద్ కేజ్రీవాల్) సింహం. అతను (ప్రధాని నరేంద్ర) మోదీకి లొంగడు. నేను, మీ కోడలు, మీ సోదరిలా అడుగుతున్నా.. కేజ్రీవాల్‌కు జరిగిన అవమానాన్ని హర్యానా తట్టుకుంటుందా? మీరు మౌనంగా ఉంటారా? మీ కుమారుడికి (ఢిల్లీ సిఎం) మద్దతు ఇవ్వలేదా? అని భివానీలో నిర్వహించిన ప్రచార సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.
బీజేపీ కేవలం అధికారంలో మాత్రమే కొనసాగాలని కోరుకుంటుంది. ప్రజా సంక్షేమం కోసం పని చేయాలన్న తపన ఆ నాయకుల్లో లేదు. పార్టీలను ఎలా విచ్ఛిన్నం చేయాలో, ప్రతిపక్ష నేతలను ఎలా జైల్లో పెట్టాలో బీజేపీకి మాత్రమే తెలుసు అంటూ సునీతా కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.