మనుభాకర్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్

ChenethaTV_ First bronze medal for India from Paris Olympics

ChenethaTV- Bharath news: పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా 10మీ ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్ మనుభాకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మనుభాకర్‌‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ‘పారిస్ ఒలింపిక్స్‌-2024లో భాగంగా దేశం తరఫున మొదటి పతకాన్ని గెలుచుకున్నారు. కాంస్య పతకాన్ని సాధించినందుకు అభినందనలు. భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కి ఈ విజయం మరింత ప్రత్యేకం, అపురూపమైన విజయం! అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *