Chenetha TV news: జన్నారం మండలం, తాళ్ల పేట అటవీ రేంజ్ తపాలా పూర్ సెక్షన్ అడవుల్లో 27.07.2024 ఉదయం వరద కాలువలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుండగా, ఆ జంకపిల్ల వరద కాలువలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, అటుగా వెళ్లిన అటవీ అధికారులు దానిని కాల్వ నుంచి బయటకు తీసి కాపాడారు. జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్ నహిదా ఫర్మిన్, బీట్ ఆఫీసర్ తులసిపతి, బేస్ క్యాంపు సిబ్బందిని, జన్నారం ఎఫ్ ఆర్ ఓ సుష్మా రావు అభినందించారు. మూగజీవాలపై ప్రతి ఒక్కరు కరుణ దయ ప్రేమ కలిగి ఉండాలన్నారు.