తనపై తప్పుడు ప్రచారానికి స్వస్తి చెప్పాలి – దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి సంచలనం కల్గిస్తున్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం. ఈ రోజు శాంతి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు, మదన్ మోహన్ కు 2013 లో వివాహం 2016లో విడాకులు అయ్యాయన్న శాంతి. తనకు మదన్ కు ఇద్దరు కవల పిల్లలు వున్నారన్న శాంతి. విడాకుల తర్వాత తాను సుభాష్ ను పెళ్లి చేసుకున్నానన్న శాంతి. సుభాష్ ద్వారా తనకు కొడుకు కలిగాడని ఆమె స్పష్టం చేశారు.
తన వయస్సు 35 సంవత్సరాలని, విజయసాయి రెడ్డి వయస్సు 68 సంవత్సరాలని , మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అన్న ఆరోపణలు చేయటానికి అర్థం వుండాలని ఆమె అన్నారు. కేవలం తనను అల్లరి పాలు చేయటానికే తన మాజీ భర్త మదన్ మోహన్ తన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి నా? లేక సుభాష్ నా? తేల్చాలని తన శాఖ అధికారికి లెటర్ ఇచ్చాడని శాంతి ఆరోపించారు.