
ChenethaTV- Visakhapatnam news: విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని దొంతలవారి కల్లాలు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిడ్జ్ డోర్ తీయడంలో విద్యుత్ షాక్ తగలడంతో దశవంతు (14) అనే బాలుడు మృతి చెందాడు ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న దశవంతు టిఫిన్ కోసం వెళ్లిన సందర్భం లో మంచినీళ్ల బాటిల్ తీసేందుకు పక్కనే ఉన్న కిరాణా షాప్ ఫ్రిడ్జ్ డోర్ తీసే ప్రయత్నంలో విద్యుత్ షాక్ తగిలింది ప్రమాదం సమయం లో షాప్ యజమాని వరసకు దశవంతు మేనమామ కావడంతో వెంటనే గాయత్రి ఆసుపత్రికి తరలించారు అప్పటికే గంభీరంగా గాయ పడిన బాలుడిని వైద్యులు ప్రథమ చికిత్స చేశారు అయితే పరిస్థితి విష మించడంతో తుది శ్వాస విడిచాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వర్షాల కారణంగా ఫ్రిడ్జ్ ఎర్తింగ్ లోపించిందని అనుమానిస్తున్నారు బాలుడి తండ్రి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ఆనందపురం సీఐ వాసు నాయుడు సూచనలతో ఏఎస్ఐ సత్తిబాబు దర్యాప్తు చేపట్టారు.