
ChenethaTV- Sircilla news: తెలంగాణ ప్రభుత్వ (గౌరవ సెక్రెటరీ) ఆదేశాల ప్రకారం బడిబాటలో భాగంగా ప్రతి శుక్రవారం పట్టణ కూడలి వద్ద సమావేశం ఏర్పాటు చేయాలని వారి ఆలోచన అనుకూలంగా బడిబాటలో భాగంగా 16.05.2025 న జడ్పీహెచ్ఎస్ బాయ్స్ శివనగర్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు స్థానిక పట్టణంలోని గణేష్ నగర్ ప్రాంతంలో కూడలి వద్ద సమావేశం (PTM) నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ మాట్లాడుతూ మా పాఠశాలలో (ప్రభుత్వ బడిలో ) 2024-25 పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరియు సిరిసిల్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో 100% ఫలితాలు సాధించిన ఏకైక పాఠశాల అని తెలియజేయుచుటకు సంతోషాన్ని వ్యక్తపరిచారు మరియు పదో తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచి 561,552,543 జిల్లా స్థాయి ర్యాంకు సాధించడం,28 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు రావడం జరిగిందని పాఠశాల గురించి గొప్పగా తెలియజేశారు. మా పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయని, మా ప్రత్యేకతలు పాఠశాల చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి ఉపకారణ వేతనాలు వచ్చేలా కృషి చేయడం (NMMS &NTSE ) మండల స్థాయి, జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లు నిర్వహణ సైన్స్ ఇన్స్పైర్లు జాతీయస్థాయి & జిల్లా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న పాఠశాల మాది మరియు ST,SC & BC మరియు వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత యూనిఫామ్ లు ,ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత టెక్స్ట్ బుక్ మరియు నోట్ బుక్స్, వ్యక్తిగత శ్రద్ధను చూపించడంలో 25 సంవత్సరాల పైబడి అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని తెలియజేస్తున్నాను, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కృత్యాధార బోధన ద్వారా విద్యను నేర్పించడం జరుగుతుందని కావున మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్,నసీరుద్దీన్, భూక్య హజు నాయక్, , సి ఆర్ పి వెంకటస్వామి మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.