
ChenethaTV- Suryapet news: సూర్యాపేట పట్టణం శ్రీ శ్రీ నగర్ నందు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AR అదనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి హాజరై సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు, నందు ప్రజలకు చట్టాల అమలు, జైలు శిక్షలు, వ్యక్తుల సత్ప్రవర్తన అంశాల గురించి వివరించారు. జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజా భరోసా కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చామని, ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని, క్షణికావేశంతో స్వార్థంతో అత్యాశతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని నేరాలకు పాల్పడవద్దని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో నిఘా ఉంచాం అన్నారు. SI సైదులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు.