
ChenethaTV- Bharat news: పాక్ అదుపులో ఉన్న BSF జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించింది. అటారీ-వాఘా బార్డర్ ద్వారా మనదేశానికి పంపింది. APR 23, 2025 న తమ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్ను PAK అదుపులోకి తీసుకుంది. అతని కోసం పాక్ రేంజర్లతో నిరంతరం ఫ్లాగ్ మీటింగ్స్, ఇతర మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు BSF ప్రకటించింది. దీనికి ప్రతిగా తమ చెరలోని ఓ పాక్ జవాన్ను ఆ దేశానికి భారత్ అప్పగించింది.