
ChenethaTV- Karimnagar news: శాతవాహన విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రెండవ సెమిస్టరు మరియు ఆరవ సెమిస్టర్ పరీక్షల ప్రణాళిక విడుదల చేశారు. పరీక్షలు 19-05-2025 నుండి 30-05-2025 వరకు జరుగుతాయని తెలిపారు. 2019 బ్యాచ్ బ్యాక్లాగ్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించామని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవలసిందిగా లేదా ఆయా కళాశాలలో సంప్రదించవలసిందిగా శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్ తెలిపారు.